Header Banner

విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వివాదం! సుప్రీం కోర్టు షాక్!

  Fri May 02, 2025 15:49        Others

విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుల్ని సవాల్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ఈ పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటామని (ఉపసంహరించుకుంటామని) సురేష్ ప్రొడక్షన్స్ కోరగా ధర్మాసనం అనుమతించింది. గతంలో ఫిల్మ్‌సిటీ కోసం రామానాయుడు స్టూడియోస్‌కు కేటాయించిన భూములను.. ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సురేష్‌ ప్రొడక్షన్స్‌కు అనుమతి ఇచ్చింది. ఈక్రమంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ భూములపై షోకాజ్ నోటీసు ఇచ్చింది.

గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ కోరింది.. ఈ నోటీసుల్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా విచారణ జరిగింది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో కోసం 34.44 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూమిలో 15.17 ఎకరాలను ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తామని రామానాయుడు స్టూడియో కోరింది.. గత ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఆ వెంటనే స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. జనసేన పార్టీ మూర్తి యాదవ్ గత ప్రభుత్వ హయాంలో నిర్ణయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ భూములను స్టూడియో కోసం ఉపయోగించాలని ఆదేశించిన సుప్రీం కోర్టు..

లేఅవుట్ సాగించే అమ్మకాలపై స్టే విధించిన సంగతి తెలిసిందే. గత నెలలో విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని.. ఆ తర్వాత చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొన్నారు. రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం 34 ఎకరాలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భూమిలో 15.17 ఎకరాలను హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని సంబంధిత యాజమన్యం కోరిందని.. ఇది నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ భూమిని ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తే.. ఆ భూముల్ని రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చర్యలకు సిద్ధమయ్యారు.. అందుకే కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఊరట దక్కలేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఏపీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు.


ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Visakhapatnam #RamanaiduStudio #LandDispute #SupremeCourt #SureshProductions #LegalBattle #LandControversy